గ్రీస్‌లోని స్కియాథోస్ విమానాశ్రయం సుందరమైన వీక్షణలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ విమానాలు దిగడాన్ని చూడటానికి ప్రతిరోజూ వందలాది మంది పర్యాటకులు ల్యాండింగ్ ప్రాంతాన్ని సందర్శిస్తారు. విమానాల ల్యాండింగ్, టేకాఫ్‌ను వీక్షించేందుకు రోజుకు సుమారు 100 మందికిపైగా ఇక్కడి వస్తారు. ఈ విమానాశ్రయం ఇతర అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుల్లా అంత పెద్దగా ఉండదు. చిన్న రన్‌వే ఉంటుంది. ఇక్కడ దిగేందుకు అనుమతి పొందిన అతిపెద్ద విమానం బోయింగ్ 757.