ప్రేమానురాగాలు మరిచారు.. స్నేహం, బంధుత్వాలు పట్టవనుకున్నారు.. కేవలం రెండు గుంటల భూమి కోసం నెలకొన్న వివాదం అన్నదమ్ముల కుటుంబాల్లో చిచ్చు పెట్టింది.. పరస్పరం ప్రాణాలు తీసుకునే వరకు వెళ్లింది.. ఈ నేపథ్యంలో జగిత్యాల అర్బన్ మండలం ధరూర్ గ్రామ శివారులో ఈరిశెట్టి రాజేశ్(28) దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు, బాధిత కుటుంబసభ్యుల కథనం ప్రకారం..
► ధరూర్‌కు చెందిన ఈరిశెట్టి బుచ్చిలింగంకు నలుగురు కుమార్తెలు. వీరిలో ముగ్గురికి వివాహాలు చేశారు. మరో కూతురు రాజేశ్వరికి మల్యాల మండలం రాజారాం గ్రామానికి చెందిన బక్కశెట్టి గంగారెడ్డితో పెళ్లి జరిపించి, అల్లుడిని ఇల్లరికం తెచ్చుకున్నాడు.
► బుచ్చిలింగం అన్న కుమారుడు ఈరిశెట్టి వెంకన్న, అల్లుడు గంగారెడ్డిలకు ఒకేచోట చెరో రెండెకరాల వ్యవసాయ భూమి ఉంది. ఇందులో వెంకన్నకు రెండు గుంటల భూమి ఎక్కువ ఉందనే కారణంతో ఇద్దరి మధ్య కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది.