టీమిండియా దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లేకు ఐపీఎల్ ఫ్రాంచైజీ పంజాబ్ కింగ్స్ షాకివ్వనున్నట్లు సమాచారం. పంజాబ్ కింగ్స్ కోచ్‌గా అనిల్ కుంబ్లే స్తానంలో కొత్త వ్యక్తిని తీసుకొచ్చే పనిలో ఉంది. ఈ సెప్టెంబర్‌తో కుంబ్లేకు పంజాబ్ కింగ్స్‌తో ఉన్న మూడేళ్ల ఒప్పందం ముగియనుంది. ఈ నేపథ్యంలోనే కుంబ్లేతో ఒప్పందాన్ని రెన్యువల్ చేసుకునేందుకు పంజాబ్ కింగ్స్ ఇష్టపడడం లేదని తెలుస్తోంది.