కూకట్‌పల్లిలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. నిజాంపేట పరిధిలోని హోలిస్టిక్ ఆస్పత్రి గ్రౌండ్‌ఫ్లోర్‌లో మంటలు చెలరేగాయి. దీంతో ఒక్కసారిగా ఆస్పత్రిలో దట్టమైన పోగలు వ్యాపించాయి. వెంటనే ఆస్పత్రి సిబ్బంది ఫైర్ అధికారులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో అప్రమత్తమైన సిబ్బంది.. రోగులను హుటాహుటిన వేరే ఆస్పత్రులకు తరలించారు. ఫైర్ సిబ్బంది 5 ఫైరింజన్‌లతో మంటలను అదుపులోనికి తెస్తున్నారు.