గుజరాత్ రాజధాని అహ్మదాబాద్‌లోని ఎల్జీ మెడికల్ కాలేజీ పేరును నరేంద్ర మోదీ మెడికల్ కాలేజీగా మార్చబోతుండడంపై తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ స్పందించారు. మహాత్మ గాంధీ పేరును కూడా నరేంద్రమోదీగా మారుస్తారని, నోట్లపై గాంధీ బొమ్మల్ని తీసేసి మోదీ బొమ్మల్ని ముద్రిస్తారని దుయ్యబట్టారు. ఈ విషయమై ట్విట్టర్ వేదికగా ఆయన స్పందిస్తూ కొద్ది రోజుల క్రితం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలంగాణలో పర్యటించారు. ఇందులో భాగంగా రేషన్ షాపులో మోదీ ఫొటో పెట్టకపోవడంపై కామారెడ్డి కలెక్టర్‌పై నిర్మల ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.