టీమిండియా యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌పై భారత మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ ప్రశంసలు కురిపించాడు. టీ20 ఫార్మాట్‌లో ప్రపంచంలోనే నంబర్ 1 బౌలర్‌గా ఎదిగే సత్తా అతడికి ఉందని కొనియాడాడు. రానున్న టీ20 ప్రపంచకప్-2022 టోర్నీకి అతడిని తప్పక ఎంపిక చేయాలని టీమిండియా సెలక్టర్లకు సూచించాడు.