జిల్లాల పునర్విభజనతో ప్రకృతి సహజసిద్ధమైన కొల్లేరు సరస్సు సంపూర్ణంగా ఏలూరు జిల్లా పరిధిలోకి వచ్చింది. ఇప్పటివరకు రెండు జిల్లాల మధ్య సరస్సు సరిహద్దు, అభయారణ్యానికి సంబంధించి వివాదాలు, చేపల సాగులో ఆధిపత్య పోరు ఇలా రకరకాల సమస్యలు కొనసాగుతుండేవి. జిల్లాల పునర్విభజన కొల్లేరుకు అతి పెద్ద మేలు చేసింది. కృష్ణాజిల్లాలోని కైకలూరు నియోజకవర్గం కొత్తగా ఏర్పాటవుతున్న ఏలూరు జిల్లాలో కలవడంతో పూర్తి కొల్లేరు విస్తీర్ణం ఏలూరు పరిధిలోకి చేరింది. 64 కొల్లేరు గ్రామాలు, మూడున్నర లక్షల జనాభా, 2.32 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కొల్లేరంతా కొత్త జిల్లాలో కలిసింది.