ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా వైసీపీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇటీవల ఏపీ డిప్యూటీ స్పీకర్ పదవికి కోన రఘుపతి రాజీనామా చేశారు. దాంతో, ఉప సభాపతి పదవి ఎన్నిక కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. కోలగట్ల వీరభద్రస్వామి ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ బలాబలాల రిత్యా ఈ పదవికి టీడీపీ పోటీ చేయలేదు.