దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్‌లో అద్భుతమైన శతకం(123)తో అదరగొట్టి, టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించిన కేఎల్ రాహుల్.. ఐసీసీ తాజా టెస్ట్ ర్యాంకింగ్స్‌లో సైతం సత్తా చాటాడు. ఈ వారపు ర్యాంకింగ్స్‌లో ఏకంగా 18 స్థానాలు మెరుగుపర్చుకుని 31వ స్పాట్‌కు ఎగబాకాడు. ఇదే టెస్ట్‌లో హాఫ్ సెంచరీతో రాణించిన మయాంక్ అగర్వాల్ ఓ స్థానాన్ని మెరుగుపర్చుకుని 11వ ప్లేస్‌కు, రెండు స్థానాలు మెరుగుపర్చుకున్న రహానే 25వ స్పాట్‌కు చేరుకోగా, టీమిండియా టెస్ట్ సారధి విరాట్ కోహ్లి రెండు ర్యాంకులు దిగజారి 9వ స్థానానికి పడిపోయాడు.