స్వదేశంలో ఇంగ్లండ్తో జరిగిన 5 టీ20ల సిరీస్ను 3-2 తేడాతో వెస్టిండీస్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా త్వరలో టీమిండియాతో జరగబోయే పరిమిత ఓవర్ల సిరీస్పై కీరన్ పొలార్డ్ సారథ్యంలోని విండీస్ జట్టు ఇప్పుడు కన్ను వేసింది. ఇంగ్లండ్తో ఐదో టీ20 అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడిన వెస్టిండీస్ కెప్టెన్ కీరన్ పొలార్డ్ కీలక వాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టుతో ఆడడం తనకు చాలా ప్రత్యేకమైనది పొలార్డ్ తెలిపాడు.