‘ఈగ’ ఫేమ్ సుదీప్ ‘కే3 కోటికొక్కడు’ తో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధం అవుతున్నారు. ఆయన హీరోగా నటించిన కన్నడ చిత్రం ‘కే3’. శివ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కన్నడలో ఘన విజయం సాధించింది. ఈ సినిమాని తెలుగులో గుడ్ సినిమా గ్రూప్‌పై ‘కే3 కోటికొక్కడు’ పేరుతో శ్రేయాస్ శ్రీనివాస్, దేవేంద్ర డీకే ఫిబ్రవరి 4న విడుదల చేస్తున్నారు.