అల్టిమేట్ ఖో–ఖో లీగ్‌లో భాగంగా రాజస్తాన్ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తెలుగు యోధాస్ 83–45తో నెగ్గింది. ఈ టోర్నీలో తెలుగు యోధాస్‌కిది మూడో విజయం. అటాకర్ సచిన్, డిఫెండింగ్ అరుణ్ తమ ప్రదర్శనతో తెలుగు యోధాస్ విజయంలో కీలకపాత్ర పోషించారు. ప్రస్తుతం తెలుగు యోధాస్ 9 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది.