రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయిపై సీఎం కేసీఆర్ యుద్ధం ప్రకటించారు. మత్తు పదా ర్థాల మాఫియాను కట్టడి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణకు ఆదేశించారు. విద్యార్థులు, యువత భవిష్యత్‌ను ఛిద్రం చేస్తున్న మత్తు వ్యవస్థను కూకటివేళ్లతో పెకలించేందుకు ప్రత్యేక సెల్‌ను ఏర్పాటుచేయాలని సూచించారు. డ్రగ్స్ నియంత్రణకు నార్కోటిక్–ఆర్గనైజ్డ్ క్రైమ్ కం ట్రోల్ సెల్‌ను ఏర్పాటుచేయాలని నిర్ణయిం చారు. పోలీస్, ఎక్సైజ్ విభాగాల నుంచి వెయ్యి మందితో దీన్ని ఏర్పాటుచేయాలని, నిందితులు ఎంతటి వారైనా శిక్షించేలా కఠిన చర్యల అమ లుకు ప్రణాళిక రూపొందించాలని నిర్దేశించారు.