కన్నడ స్టార్ కిచ్చా సుదీప్, బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ మధ్య తలెత్తిన హిందీ భాషా వివాదం ప్రస్తుతం కర్ణాటక ముఖ్యమంత్రి వరకు చేరింది. కన్నడ సూపర్‌స్టార్ సుదీప్‌కు మద్దతుగా సీఎం బసవరాజ్ బొమ్మై నిలిచారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పడ్డాయని, కాబట్టి ప్రాంతీయ భాషలు చాలా ముఖ్యమైనవని పేర్కొన్నారు. సుదీప్ మాటలు సరైనవేనని, దానిని అందరూ అర్థం చేసుకొని గౌరవించాలని సీఎం బొమ్మై సూచించారు. కాగా ఇప్పటికే కర్ణాటక మాజీ సీఎం సిద్ధ రామయ్య, కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ కిచ్చ సుదీప్‌కు అండగా నిలిచారు.