అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఏజెంట్’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద ఎలాగైనా బ్లాక్‌బస్టర్ హిట్ అందుకోవాలని అఖిల్ తెగ కష్టపడుతున్నాడు. ఇక ఈ సినిమాను దర్శకుడు సురేందర్ రెడ్డి ఓ స్పై థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. కాగా, ఈ సినిమా తరువాత అఖిల్ తన నెక్ట్స్ చిత్రాన్ని ఎవరితో చేస్తాడా అనే ఆసక్తి అక్కినేని అభిమానుల్లో నెలకొంది. అయితే, అఖిల్ నెక్ట్స్ ప్రాజెక్టు కోసం తండ్రి నాగార్జున అక్కినేని భారీగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.