బీటౌన్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సమాజంలోని పరిస్థితులపై తనదైన శైలీలో కుండబద్ధలు కొట్టినట్లుగా మాట్లాడేస్తుూ ఉంటుంది. అలా మాట్లాడటంతో దేశంలోనే మోస్ట్ డేరింగ్ హీరోయిన్గా పేరు వచ్చింది. సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తూ కాంట్రవర్సీ క్వీన్‌గా రికార్డుకెక్కింది. ఏ విషయం గురించి అయినా ఎలాంటి భయం లేకుండా బయటకు చెప్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. ఈ వ్యాఖ్యలతో కంగనా రనౌత్ పలుసార్లు వివాదాలపాలైంది కూడా. కానీ కంగనా బోల్డ్ యాటిట్యూడ్ అనేకమంది దృష్టిని ఆకర్షించింది.