స్వదేశంలో దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు ముందు న్యూజిలాండ్‌కు ఎదురు దెబ్బ తగిలింది. మోచేతి గాయంతో బాధపడుతున్న కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఇంకా కోలుకోకపోవడంతో ఈ సిరీస్‌కు దూరం కానున్నాడు. అతడు ఇంకా రిహాబిలిటేషన్ సెంటర్‌లోనే ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఇటీవల సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో సారథి, స్టార్ బ్యాటర్ విలియమ్సన్ లేని లోటు స్పష్టంగా కనిపించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు డ్రా కాగా.. రెండో టెస్టులో బంగ్లా చారిత్రాత్మక విజయం సాధించింది. ఇక మూడో టెస్టులో కివీస్ ఘన విజయం సాధించింది.