ఇండియన్ ప్రీమియర్ లీగ్ మొదటి సీజన్ విజేతగా నిలిచిన రాజస్తాన్ రాయల్స్ యాజమాన్యం ది రాయల్ గ్రూప్ సౌతాఫ్రికా టీ20 లీగ్‌లోనూ భాగం కానుంది. పర్ల్ ఫ్రాంఛైజీని కొనుగోలు చేసిన రాయల్ గ్రూప్.. శుక్రవారం తమ జట్టు పేరును వెల్లడించింది.
ఈ మేరకు.. ‘‘ది రాయల్ స్పోర్ట్స్ గ్రూప్ తమ కొత్త టీ20 ఫ్రాంఛైజీకి ‘పర్ల్ రాయల్స్’గా నామకరణం చేసింది. క్రికెట్ సౌతాఫ్రికా వచ్చే ఏడాది ఆరంభించనున్న టీ20 టోర్నమెంట్‌లో పర్ల్ రాయల్స్ ఆడనుంది’’ అని అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇక ఇప్పటికే ఐపీఎల్‌లో రాజస్తాన్ రాయల్స్ జట్టును కలిగి ఉన్న రాయల్ గ్రూప్.. కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో బార్బడోస్ జట్టుతో బరిలోకి దిగుతోంది.