ఇజ్రాయెల్–ఇస్లామిక్ జిహాద్ మధ్య ఘర్షణ నానాటికీ తీవ్రరూపం దాలుస్తోంది. ఇస్లామిక్ జిహాద్ ఉద్యమానికి అడ్డాగా మారిన గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు ఆదివారం మూడో రోజుకు చేరాయి. శుక్రవారం దాడులు మొదలైన సంగతి తెలిసిందే. ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించడంతో తాజాగా ఇస్లామిక్ జిహాద్ ఉద్యమ అగ్రనేత ఖలీద్ మన్సూర్ హతమయ్యాడు. మరో ఇద్దరు ఉగ్రవాదులు, ఐదుగురు సాధారణ పౌరులు సైతం ప్రాణాలు కోల్పోయారు. దీంతో గత మూడు రోజుల్లో ఇజ్రాయెల్ ప్రకోపానికి బలైన వారి సంఖ్య 31కు చేరింది.