రాజకీయ అనిశ్చితి, ఆర్ధిక సంక్షోభంతో కొట్టిమిట్టాడుతున్న ద్వీప దేశం శ్రీలంక, మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స పలాయనం తర్వాత ఆర్ధిక వ్యవస్థను చక్కదిద్దుకునే పనిలో పడింది. రణిల్ విక్రమసింఘే నేతృత్వంలో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థకు మూల స్థంభమైన పర్యాటక రంగానికి పునరుత్తేజం తీసుకువచ్చే దిశగా అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగా ఆ దేశ మాజీ క్రికెటర్, దిగ్గజ ఆటగాడు సనత్ జయసూర్యకు కీలక బాధ్యతలు అప్పజెప్పింది. జయసూర్యను టూరిజం ప్రచారకర్తగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.