శ్రీలంక పోర్టు హంబన్‌టొటలో చైనా నిఘా నౌక యువాన్ వాంగ్ 5 రావడంతో భారత్ భద్రతకు భంగం వాటిల్లే పరిణామమేదైనా జరుగుతుందేమోనని పర్యవేక్షిస్తున్నామని విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ చెప్పారు. భారత్ థాయ్‌లాండ్ జాయింట్ కమిషన్ భేటీ సందర్భంగా జైశంకర్ మాట్లాడారు. మా పొరుగు దేశంలో జరిగే ఎలాంటి పరిణామాలైననా గమనిస్తూ ఉంటామని చెప్పారు. చైనాకు చెందిన హైటెక్ నౌక యువాన్ వాంగ్ 5 శాంతి, స్నేహ సంబంధాల మిషన్ అని ఆ నౌక కెప్టెన్ జాంగ్ హాంగ్‌వాంగ్ పేర్కొన్నారు.