పాలస్తీనా భూభాగంపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. మంగళవారం నబ్లాస్ సిటీపై జరిపిన దాడిలో ముగ్గురు పాలస్తీనియన్లు మరణించారు. 40 మంది స్థానికులు గాయపడ్డారు. గాజా స్ట్రిప్‌లో మూడ్రోజుల కాల్పుల విరమణ ముగిసిన మరునాడే ఈ దాడి జరగడం గమనార్హం.
ఈ ఏడాది తొలినాళ్లలో వెస్ట్‌బ్యాంక్‌లో వరుస దాడులకు కారకుడైన అల్–అక్సా సాయుధ దళం నేత ఇబ్రహీం అల్–నబుల్సీను ఆయన ఇంట్లోనే హతమార్చామని ఇజ్రాయెల్ పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో నబుల్సీ, మరో ఇద్దరు సాయుధులు మరణించారని పాలస్తీనా ఆరోగ్య శాఖ వెల్లడించింది.