ఇన్‌స్టా గ్రామ్‌లో గుర్తుతెలియని వ్యక్తి ఒక అమ్మాయికి మాయమాటలు చెప్పి లక్షలాది రూపాయలను కొట్టేశాడు. బెంగళూరు నగరంలో ఓ ప్రైవేటు కాలేజీలో డిగ్రీ చదువుతున్న 19 ఏళ్ల విద్యార్థినికి ఇటీవల ఇన్ స్టాగ్రామ్‌లో ఫ్రాంక్లిన్ జాక్సన్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. కొద్దిరోజుల పాటు ఇద్దరూ చాటింగ్ చేసుకోవడంతో స్నేహం పెరిగింది. జాన్సన్ లండన్‌లో ఉంటున్నానని చెప్పాడు. నీ పుట్టినరోజుకు 15 వేల పౌండ్లతో పాటు విలువైన కానుకలను పంపిస్తానని యువతిని నమ్మించాడు.