క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్. స్వదేశంలో వెస్టిండీస్‌తో జరగనున్న మాడు టీ20ల సిరీస్‌కు ఈడెన్ గార్డెన్స్ ఆతిథ్యం ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్- వెస్టిండీస్ మధ్య జరగబోయే మ్యాచ్‌లకు 75 శాతం ప్రేక్షకులను అనుమతించేందుకు బెంగాల్ ప్రభుత్వం అంగీకరించింది. అన్ని ఇండోర్, అవుట్‌డోర్ స్టేడియాల్లో జరిగే క్రీడలకు 75 శాతం ప్రేక్షకులను అనుమతి ఇస్తున్నట్లు సోమవారం రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మ్యాచ్‌లకు సుమారు 50,000 మంది ప్రేక్షకుల హాజరయ్యే అవకాశం ఉంది.