ఆహారానికి రుచి రావాలంటే ఉప్పు వాడాల్సిందే. ఇది నిజమే అయినప్పటికీ పరిమితికి మించి రోజువారి ఆహారాల్లో ఉప్పు వాడటం అన్నది ఏమాత్రం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉప్పు ఎక్కువగా ఉపయోగించే వారిలో రక్తపోటు , అది గుండె జబ్బులు, పక్షవాతం వంటి ఎన్నో సమస్యలు వస్తున్నాయని అనేక పరిశోధనల్లో తేలింది. దీంతో ఉప్పు వాడకం విషయంలో జాగ్రత్తలు పాటించమని నిపుణులు సూచిస్తున్నారు.