ఆన్‌లైన్ ద్వారా హార్స్ రేస్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముగ్గురు వ్యక్తులతో పాటు మరో ఇద్దరిని రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం రాచకొండ కమిషనరేట్‌లో సీపీ మహేష్ భగవత్ వివరాలు వెల్లడించారు. మీర్‌పేట్ నందనవనం కాలనీకి చెందిన తిరుమల్‌రెడ్డి, జోజిరెడ్డి, గుర్రపు పందేల్లో పాల్గొని డబ్బులు పోగొట్టుకున్నారు. వాటిని తిరిగి సంపాదించుకునేందుకు తమ అనుభవాన్ని ఉపయోగించి ఆన్‌లైన్ బెట్టింగ్ ప్రారంభించారు.