రాజధాని ఏ ప్రాంతంలో ఉండాలన్న అంశం జోలికి తాము వెళ్లబోవడం లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల చట్టాన్ని ఉపసంహరించుకున్న నేపథ్యంలో ఇక ఆ అంశంపై వాదనలు అవసరం లేదని స్పష్టం చేసింది. పాలనా వికేంద్రీకరణ చట్టంతో పాటు సీఆర్‌డీఏ రద్దు చట్టాన్ని కూడా ప్రభుత్వం ఉపసంహరించుకున్న నేపథ్యంలో ఈ వ్యవహారంలో ఇప్పటికే దాఖలైన వ్యాజ్యాల్లో ఏ అభ్యర్థనలు మనుగడలో ఉంటాయి? వాటి విషయంలో ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వాలన్న అంశంపైనే తాము ప్రధానంగా దృష్టి సారించామని వెల్లడించింది.