తెలంగాణలో మరో మూడు రోజులు భారీ వర్షాలు కురువనున్నాయి. రాష్ట్రంలో ఈ నెల 4 నుంచి 6 వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదారాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఏపీ తీరంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్న ఆవర్తనం సముద్ర మట్టానికి 5.8 కిలో మీటర్ల ఎత్తు వరకు విస్తరించి నైరుతి దిశగా వంపు తిరిగి ఉందని తెలిపింది.