తెలంగాణలో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రేపు వాయవ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడుతుందని అన్నారు. అనంతరం 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. ఇవాళ, రేపు పొడి వాతావరణం ఏర్పడడంతో పాటు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు చెప్పారు.