గర్భసంచి ముఖ ద్వారం చిన్నగా ఉన్నా, ముందుగానే తెరుచుకుంటున్నా (అంటే 34 వారాలకు ముందు) సర్వైకల్ స్టిచ్ వేస్తారు. ఈ పరిస్థితిని అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా గుర్తిస్తారు. గర్భస్రావం అవకుండా, సమయానికి ముందే కాన్పు కాకుండా ఈ సర్వైకల్ స్టిచ్ ఆపుతుంది. కొంతమందిలో ముందు ప్రెగ్నెన్సీలో సమస్యలు తలెత్తినా, సెర్విక్స్ చిన్నదైపోయి సమయానికి ముందే కాన్పు అయినా, లేదా సెర్విక్స్ పైన ఏదైనా ఆపరేషన్ చేసినా తర్వాత ప్రెగ్నెన్సీలో మూడవ నెలలోనే ఇలా కుట్లు వేస్తారు.
సర్వైకల్ స్టిచ్‌ను 12 – 24 వారాల్లోపు వేస్తారు. అవసరమైన కేసెస్‌లో మాత్రమే నెలలు నిండిన తరువాత అంటే 37 – 38 వారంలో ఓపీలోనే ఇంటర్నల్ ఎగ్జామ్ చేసి ఈ కుట్లను విడిచి.. నార్మల్ డెలివరీ కోసం వెయిట్ చేయొచ్చు. నొప్పులు వస్తే ఈ కుట్లను ముందుగానే తీసేస్తారు. ట్రాన్స్‌వెజైనల్ స్కాన్‌లో సెర్విక్స్ 25ఎమ్‌ఎమ్ కన్నా తక్కువ వస్తే స్టిచ్ వేస్తారు.