ముఖారవిందానికి కళ తెచ్చేవి ఒత్తైన కేశాలే. వాటిని ఎలా కాపాడుకోవాలి? పోషణ ఎలా? ఎలా దువ్వితే మంచిది? ఏ షాంపూ వాడాలి? … ఇలా ప్రతీది సందేహమే. పొట్టిదైనా, పొడుగుదైనా జుట్టు విషయంలో చాలా మంది పొరపాట్లు చేస్తూనే ఉంటారు. జుట్టు ఊడిపోతోందని బాధపడుతూనే ఉంటారు. అలా కాకుండా.. కురుల సిరులు కాపాడుకోవాలంటే రోజువారీగా కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి.