రాష్ట్రంతో పాటు ముంబై తదితర ప్రాంతాల్లో సరళ వాస్తు గురూజీగా పేరొందిన చంద్రశేఖర్ గురూజీ దారుణ హత్య రాష్ట్రంలో కలకలం సృష్టించింది. మంగళవారం హుబ్లీలో ప్రెసిడెంట్ హోటల్లో ఆయనను శిష్యులు మహంతేష్, మంజునాథ్ కత్తులతో పొడిచి చంపడం తెలిసిందే. పోలీసులు దర్యాప్తులో అనేక విషయాలు వెలుగుచూశాయి. స్థిరాస్తుల విషయంలో నిందితులు, ఎంతో కాలంగా విశ్వాసంగా ఉన్న మహంతేష్ దంపతులతో గురూజీకి ఆస్తుల గురించి వివాదం తలెత్తింది. ఇటీవల మహంతేష్ ఆస్తులను అమ్మగా రూ. 5 కోట్లు వచ్చిందని తెలిసింది.