కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్ నగర ప్రజలను నిరాశపర్చింది. కరోనా నేపథ్యంలో మధ్య తరగతి, దిగువ మధ్యతరగతి జనం ఇప్పటికే ఆర్థిక పరిస్థితులు బాగా లేక సతమతమవుతున్నారు. కేంద్ర బడ్జెట్‌పై గ్రేటర్ జనం ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ప్రత్యేకంగా వేతన జీవులకు ఎలాంటి ఊరట కల్పించలేదు. ఇప్పటికే నిత్యావసరాల ధరలు మండుతున్నాయి. ఈ బడ్జెట్‌తో ధరలు మరింత పెరుగుతాయని నగర వ్యాపారుల అంచనా.