‘గూగుల్ కుట్టప్ప’ చిత్రం ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని ఆ చిత్ర దర్శకద్వయం శబరి, శరవణన్ పేర్కొన్నారు. వీరు కేఎస్.రవికుమార్ శిష్యులు. మలయాళంలో మంచి విజయాన్ని సాధించిన ఆండ్రాయిడ్ కుంజప్పన్ చిత్రానికి ఇది రీమేక్. దర్శకుడు కె.ఎస్.రవికుమార్ ప్రధాన పాత్ర పోషించిన ఇందులో బిగ్‌బాస్ ఫేమ్ దర్శన్, లాస్లియా హీరో హీరోయిన్లుగా నటించారు. యోగిబాబు, మనోబాల, కుట్టి రోబో కీలక పాత్రలు పోషించారు.