భార్య చెల్లెలు.. పైగా మైనర్‌పై అత్యాచారానికి పాల్పడిన ఓ వ్యక్తిని పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు. శివమొగ్గ జిల్లాలోని కుంసి పరిధిలో చోటుచేసుకున్న దారుణ ఘటనలోకి వెళ్తే.. సదరు బాధితురాలు.. అక్క-బావ ఇంట్లో ఉంటూ చదువుకుంటోంది. ఈ క్రమంలో కన్నబిడ్డలా చూసుకోవాల్సిన ఆ బాలికను.. కామంతో చూడడం మొదలుపెట్టాడు. భార్య కళ్లు గప్పి మాయమాటలు చెప్పి ఆ బాలికపై లైంగికవాంఛలు తీర్చుకుంటూ వచ్చాడు.