భారత క్రికెట్ నియంత్రణ మండలి అధ్యక్షుడు, టీమిండియా మాజీ సారథి సౌరవ్ గంగూలీ కుటుంబాన్ని కరోనా వదలడం లేదు. ఇప్పటికే కోవిడ్(డెల్టాప్లస్ వేరియంట్)తో ఆస్పత్రిలో చేరిన గంగూలీ ఇటీవలే డిశ్చార్జ్ అయిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఆయన కుమార్తె సనా గంగూలీ కరోనా బారిన పడినట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.