వినాయక చవితి ఉత్సవాలు బుధవారం దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. 9 రోజులపాటు గణపయ్య పూజలు అందుకోనున్నారు. ఈక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ.. ఢిల్లీలోని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ నివాసానికి వెళ్లారు. అక్కడ తొలిరోజు గౌరీ తనయుడికి హారతి ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు గణేష్ చతుర్థి సందర్భంగా ఆయన ట్విటర్ వేదికగా దేశ ప్రజలకు పండగ శుభాకాంక్షలు తెలిపారు. సంస్కృతంలోని ఓ శ్లోకాన్ని సైతం ఆయన షేర్ చేశారు.