చాలామంది ఇళ్లలో పెద్దవాళ్లు ఇప్పటికీ కూడా అరికాళ్లకు, పాదాలకు కొబ్బరినూనె రాయించుకుని కాళ్లు పట్టించుకుంటూ ఉండటం చూస్తుంటాం. అయితే అది పాతకాలం పద్ధతి అని కొట్టిపారేయద్దని, పాదాలకు మసాజ్ చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని ఆధునిక పరిశోధనలు కూడా చెబుతున్నాయి.
అరికాళ్ల మసాజ్ కాళ్ల నొప్పులతోపాటు మానసిక ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. రోజూ పాదాలకు మసాజ్ చేస్తే కాళ్లకు సత్తువ పెరుగుతుంది. ఒక పరిశోధన ప్రకారం… పాదాలకు మసాజ్ చేయడం నాడీవ్యవస్థను ఉత్తేజ పరుస్తుంది. మెదడులో ఉండే ఎండార్ఫిన్ రసాయనాల ఉత్పత్తిని పెంచుతుంది.