అమెరా ఎఫ్సీ, పెర్సెబయ సురబయ జట్ల మధ్య మ్యాచ్ తీవ్ర విషాధాన్ని మిగిల్చింది. ఈ మ్యాచ్లో అమెరా ఎఫ్సీ ఓటమి పాలు కావడాన్ని జీర్ణించుకోలేని అభిమానులు పిచ్మీదకు దూసుకెళ్లి విధ్వంసానికి పాల్పడ్డారు. అనంతరం జరిగిన తొక్కిసలాటలో 174 మంది ప్రాణాలు కోల్పోగా మరో 180 మంది గాయాలపాలయ్యారు. ఇండోనేషియాలోని మలంగంలో ఉన్న కంజురహాన్ స్టేడియంలో శనివారం రాత్రి జరిగిన దుర్ఘటన ఇది. క్రీడా ప్రపంచంలో జరిగిన అత్యంత బాధాకరమైన దుర్ఘటనల్లో ఇది ఒకటని అంటున్నారు.