ఊబకాయులకు ఓ శుభవార్త. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒళ్లు తగ్గడం లేదన్న మీ బెంగ త్వరలోనే తీరబోతోంది. ఎందుకంటే మధుమేహానికి వాడే సెమాగ్లుటైడ్ అనే మందు శరీరాన్ని తగ్గించేందుకు భేషుగ్గా ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆకలిని నియంత్రించే వ్యవస్థను తన అధీనంలోకి తీసుకోవడం ద్వారా ఈ మందు పని చేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ మందును వాడిన ఊబకాయుల్లో 33 శాతం మంది బరువు తగ్గారు. అది కూడా వారి శరీర బరువులో 20 శాతం వరకు తగ్గుదల నమోదు కావడం విశేషం.