బాలీవుడ్ బుల్లితెర హీరోయిన్ ఎరికా ఫెర్నాండెజ్ బుధవారం కరోనా సోకినట్లు తెలిపింది. ఆమెతోపాటు తన తల్లికి కూడా కొవిడ్ 19 పాజిటివ్ వచ్చినట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని ఇన్‌స్టా వేదికగా తెలిపింది. కరోనా పరీక్షలు నిర్వహించుకోగా పాజిటివ్ వచ్చినట్లుగా ఎరికా పేర్కొంది. అయితే ముందుగా తాను హోమ్ కిట్స్‌తో పరీక్షలు చేసుకోగా నెగెటివ్ వచ్చినట్లు తెలిపింది. అయినా దగ్గు, జలుబు, గొంతు నొప్పి తగ్గకపోగా ఎక్కువ కావడంతో ల్యాబ్‌లో పరీక్షించికున్నట్లు వెల్లడించింది. ఆ పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలిందని ఇన్‌స్టా పోస్టులో రాసుకొచ్చింది ఎరికా.