హమ్మయ్య.. ఎలక్ట్రిక్ బైక్ లు వచ్చేశాయి.. ఇక పెట్రోల్ తో పని లేదు, ఎంచక్కా డబ్బు ఆదా చేయొచ్చు అని అంతా అనుకున్నారు. తెగ సంతోషపడ్డారు. కానీ, వారి ఆనందం ఎంతో కాలం నిలిచేలా కనిపించడం లేదు. ఎందుకంటే ఇటీవలి కాలంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ వరుసగా బాంబుల్లా పేలిపోతున్నాయి, మంటల్లో కాలిపోతున్నాయి.