డ్రోన్లతో బోలెడన్ని ఉపయోగాలున్నాయి. నిఘా, భద్రత, మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్, రక్షణ, రవాణా, వ్యవసాయరంగంతోపాటు అనేక రంగాల్లో డ్రోన్లు ఉపయోగపడుతున్నాయి. ఇప్పుడు వీటిని తొలిసారిగా విద్యుత్ రంగంలో కూడా వాడబోతున్నారు. విద్యుత్ పంపిణీ వ్యవస్థ పర్యవేక్షణలో డ్రోన్లను వాడాలని మధ్యప్రదేశ్ విద్యుత్ సంస్థ నిర్ణయించింది.