ఇండియాలో కొవిడ్ మహామ్మారి తన సత్తా చాటుతోంది. చాపకింద నీరులా రోజురోజుకీ తన ఉనికి పెంచుకుంటూ విజృంభిస్తోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు తేడా లేకుండా క్రమంగా పాజిటివ్ కేసుల సంఖ్య పెంచుకుంటూ పోతూ బాలీవుడ్‌లో కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే అర్జున్ కపూర్, కరీనా కపూర్, నోరా ఫతేహీ, జాన్ అబ్రహం, ఆయన భార్య ప్రియా రుంచల్, మృణాల్ ఠాకూర్, ఏక్తా కపూర్, అలయ ఎఫ్, అర్జున్ బిజ్లానీ, డెల్నాజ్ ఇరానీ, ప్రేమ్ చోప్రా వంటి పలువురు బీటౌన్, టీవీ ప్రముఖులు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా పాపులర్ సీరియల్ నటి కొవిడ్‌కు గురయ్యింది.