బీజేపీ నాయకురాలు డీకే అరుణ కూతురు శృతిరెడ్డిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 7లో నివసించే పొట్లూరి వరప్రసాద్ ఇంటి కాంపౌండ్ వాల్ నిర్మాణం విషయంలో గత నెల 14వ తేదీన జరిగిన గొడవలో శృతిరెడ్డి తనపై కులం పేరుతో దూషించారని బోరబండ రా జ్నగర్కు చెందిన ఎం.ఎలిషాబాబు న్యా యస్థానా న్ని ఆశ్రయించారు.