ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఈడీ దాడుల్లో దూకుడు పెంచింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో చాలామంది పలు రాష్ట్రాలకు సంబంధించిన ప్రముఖుల పేర్లు వినిపిస్తున్నాయి. ఈక్రమంలో లిక్కర్ స్కామ్ విషయంలో ఈడీ దాడుల్ని కొనసాగిస్తోంది. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో 40 ప్రాంతాల్లో దాడులు నిర్వహిస్తోంది. ఢిల్లీతోపాటు పంజాబ్, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ఆయా ప్రాంతాల్లో అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఢిల్లీకి చెందిన ఈడీ అధికారులు 25 బృందాలుగా ఏర్పడి బెంగళూరు, చెన్నై, నెల్లూరు, హైదరాబాద్‌లోని పలువురి ఇండ్లు, కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టారు.