లిక్కర్ స్కామ్ విచారణలో దూకుడు పెంచిన ఈడీ అరెస్టుల పర్వాన్ని కొనసాగిస్తోంది. మంగళవారం విజయ్ నాయర్ ను అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు తాజాగా ఇండోస్పిరిట్స్ సంస్థ ఎండీ సమీర్ మహేంద్రును అరెస్ట్ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సమీర్ మహేంద్రు ఏ5 నిందితుడిగా ఉన్నారు. రాధా ఇండ్రస్ట్రీస్ కు చెందిన యూకో బ్యాంక్ ఖాతాకు సమీర్ మహేంద్రు రూ.కోటి ట్రాన్స్ ఫర్ చేసినట్లుగా ఈడీ దర్యాప్తులో నిర్ధారణ కావటంతో సమీర్ ను అరెస్ట్ చేశారు.