సఫారీ గడ్డపై టెస్టు సిరీస్ గెలిచి చరిత్ర సృష్టించాలని టీమిండియా భావిస్తుంటే… భారత్‌పై స్వదేశంలో తమ జైత్రయాత్రకు సంబంధించిన రికార్డును కొనసాగించాలని ప్రొటిస్ జట్టు పట్టుదలగా ఉంది. ఈ క్రమంలో కేప్‌టౌన్ వేదికగా జనవరి 11 నుంచి ప్రారంభం కానున్న మూడో టెస్టు ఇరు జట్లకు కీలకంగా మారింది. ఇప్పటికే 1-1తో సమంగా ఉన్న సిరీస్‌లో చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.