‘అర్థం’ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయం అవుతోంది నటి శ్రద్ధాదాస్. మినర్వా పిక్చర్స్ పతాకంపై రాధిక శ్రీనివాస్ నిర్మించిన చిత్రం అర్థం. మణికాంత్ తల్లకుటి కధా, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించిన ఈ ద్విభాషా చిత్రం (తెలుగు, తమిళం)లో నటుడు మాస్టర్ మహేంద్రన్, నటి శ్రద్ధాదాస్ హీరో హీరోయిన్లుగా నటించారు. ఇతర ముఖ్యపాత్రల్లో అజయ్, ఆమని, సావిత్రి, ప్రభాకర్, రోహిణి, రోబో శంకర్ నటించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.