‘బార్’ కంటే ‘చాకోబార్’ మేలనీ… ‘ఆల్కహాల్’ ఆరోగ్యానికి చేటు కాగా… దానికి భిన్నంగా ‘చాకో’హాలికులు (పరిమితంగానే) కావడం హెల్త్‌కే కాదు… మంచి మూడ్స్‌కీ మంచిదంటున్నారు పరిశోధకులు. డార్క్ చాక్లెట్లు గుండెకు మేలు చేస్తాయనీ, వాటితో మంచి ఆరోగ్యం సమకూరుతుందని ఇప్పటికే కొన్ని అధ్యయనాల్లో తేలినా… ఇప్పుడు దక్షిణ–కొరియన్ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో తాజాగా మరెన్నో విషయాలు వెల్లడయ్యాయి. చాకోలెట్‌లో ఉండే పదార్థాలు మన జీర్ణవ్యవస్థలో నెలవై ఉండే… మనకు మేలు చేసే సూక్ష్మజీవుల (మైక్రోబ్స్)పై చూపే ప్రభావం వల్ల మనం మరింత ఆరోగ్యకరంగా మారతామని అంశం వాళ్ల పరిశోధనల్లో వెల్లడైంది.